ఇన్నెళ్ళ సినిమా ప్రయాణంలో నయనతార ప్రపంచాన్ని చక్కగా అర్ధం చేసుకొన్నారు. జీవితాన్ని తను చూసే కోణం గురించి మాట్లాడుతూ మన అందరికీ జీవితం పట్ల ఒక అవగాహన ఉంది. భవిష్యత్త్ లో ఏం కాదలుచుకొన్నమో అన్న విషయంపైన కూడా స్పష్టత ఉంది. నాకు ప్యూచర్ విషయంలో స్పష్టమైన మంచి ఆలోచనలు ఉన్నాయి. వాటిని సాకారం చేసుకొనే దిశలో ఉన్నాను. నన్ను ఎవరైనా తప్పుపడితే పట్టించుకోను. విలువైన సమయం వృధా ఆలోచనలను పరిమితం చేస్తే మనకే నష్టం .నేను ఇతరుల కోసం ,వాళ్ళ అభిప్రాయం కోసం బతకటం మానేశాను అంటోంది నయనతార.మనం ఉన్నా సమాజం అంటే ఇరుగు పొరుగు వాళ్ళతో బావుంటాం. కానీ ఆ నలుగురు ఇరుగు పొరుగు వారే కాదు మన జీవితం. ఎంతో విశాలం ఎంతో సంతోషంగా జీవించగలిగే చక్కని ప్రపంచం ఇది అంటోంది నయనతార .ఇది అమ్మాయిలందరికీ వర్తిస్తుంది. ప్యూచర్ విషయంలో స్పష్టంగా ముందుకు పోండి.

Leave a comment