నీహారికా, జీవితం మొత్తంగా రాజీ పడుతూనే పోవాలి అంటారు. ఒక సరస్సులో ఉండే పడవలు గాలి దిశకు అనుసరించి ఒకే వైపుగా వేళతాయా? వాటి  గమ్యం వైపు గాలికి ఎదురీదుతూ కూడా సాగి పోతాయి. జీవితము అంతే మనం ఎంచుకొన్న మార్గం వైపు సాగి పోతూ ఉంటుంది. పరిస్తితుల్ని మనం ఎంచుకోక పోయినా మన దృక్పథాన్ని ఎంచుకోగం కదా. దైనందిన జీవితంలో మంచి చెడు రెండు ఎదుగుతాయి. వాటిని బలం తో ఎదుర్కోవాలి. సందర్భాన్ని బట్టి రాజీ పడాలి కానీ ప్రతీసారి రాజీ తోనే లైఫ్ గడపనక్కర్లేదు. కాకపోతే కాస్త ప్లెక్సిబిలిటి కావాలి. అంతే గానీ మొండిగా నేనింతే  అని గిరి గీసుకొని జీవించడం మాత్రం కష్టమే మనలో జీవితఃమ్ పట్ల ఓ స్పష్టత  ఉంటె దాన్ని అనుసరించి అవసరాన్ని బట్టి ఒక్కో సారి సర్దుకుపోవాలి, రాజీ పడాలి, ఎదురీది నిలబలాలి కూడా. అదే జీవితం.

Leave a comment