జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ పనితీరుని పర్యవేక్షించే స్పేస్‌ టెలిస్కోప్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆస్ట్రానమర్‌ నిమిషా కుమారి.ఈ ప్రతిష్ఠాత్మక టెలిస్కోప్‌ రూపకల్పనలో.. సైన్స్‌, ఆపరేషన్స్‌ బృందంలో ఉన్న ఏకైక ఆసియా అమ్మాయి నిమిషా. కానీ డిగ్రీలోకి వచ్చే వరకూ టెలిస్కోప్‌నే చూడలేదు. ‘మాది చాలా వెనుకబడిన ప్రాంతం. మా ఊళ్లో పుస్తకాల దుకాణాలు చాలా తక్కువ. ఇప్పటికీ మాకు సరైన రవాణా సదుపాయం లేదు.ఆస్ట్రానమర్‌  అవ్వాలన్నది నా చిన్ననాటి కల. పట్టుదలగా చదివి ఆస్ట్రోఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేసేందుకు ఫ్రాన్స్‌ వెళ్లాను. మా తరగతిలో 30 మంది ఉంటే నేనొక్కదాన్నే అమ్మాయిని. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో గెలాక్సీల ఆవిర్భావంపై పీహెచ్‌డీ చేశాను. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటేనే ఇంతవరకూ రాగలిగా. 2020లో జేమ్స్‌ వెబ్‌టీమ్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీస్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆస్ట్రానమీ (ఆరా) ఆస్ట్రానమర్‌గా అడుగుపెట్టాను.

Leave a comment