పిల్లలు మట్టిలో ఆడేందుకు ఇష్టపడతారు.అలాగే కొన్న బొమ్మలతోనూ సమయం గడిపేస్తూ ఉంటారు. వాళ్ళకు ఏదైనా తినేందుకు ఇచ్చినప్పుడల్లా పిల్లల చేతులు పదేపదే శుభ్రం చేస్తూంటారు తల్లులు. లేదా వాళ్ళకు శుభ్రం అలవాటు చేసేందుకు ఎంతో ప్రయత్నం చేస్తారు.ఈ అతి శుభ్రత కారణంగానే పిల్లలు అనారోగ్యల భారీన పడతారంటున్నారు పరిశోధకులు .శరీరంలో కోటానుకోట్ల సూక్ష్మజీవులుంటాయి. వాటిలో కొన్ని ఆరోగ్యానికి ఉపయోగపడేవే .ఇలాంటి సూక్షజీవులు పిల్లల చేతుల ద్వారా శరీరంలోకి వెళ్ళేవే . ఈ అతి శుభ్రం కారణంగా మంచి సూక్ష్మ జీవులు కూడా పిల్లల శరీరంలో చేరే అవకాశం పోతుంది. పిల్లలు రోగనిరోధక శక్తిని నిలుపుకోలేక తరుచూ అనారోగ్యలకు గురవుతారు.పిల్లలు ఆటల నుంచి రాగానే మామూలు నీళ్ళతో వాళ్ళ చేతులు శుభ్రం చేసుకొనిస్తే చాలంటున్నారు ఎక్స్ పర్ట్స్.
Categories