నీహారికా,చాలా సార్లు ఎదుటివాళ్ల మాటలకు మనసు బాధ పెట్టుకుంటాము.కానీ అలా బాధపడితే మనకే నష్టం ,ఒత్తిడి పెంచుకోవడం ప్రయోజనం లేదంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ఇతరుల దురుసు తనతంతో బాధపడటం దండగా ఆ మాటాలు వాళ్ల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిప చేస్తాయి.అలాగే ఎదుటి వాళ్లు ఎదైనా కామెంట్ చేస్తే దానికి కారణం ఏమై ఉంటుందో అని ముందుగా ఆలోచించుకోవాలి. అంతకు ముందు మనం వాళ్లను ఏవిధంగానైనా నొప్పించామా? ఆ చిరాకు కొద్ది వాళ్లు అలా మాట్లాడుతున్నారా అని ఆత్మవిమర్శ చేనసుకోవాలి. వాళ్లు ఒక వేళ ఎదురైనప్పుడు నవ్వకపోయిన దాన్నీ అవమానంగా భావించవద్దు. ఒక వేళ వాళ్లకే వాళ్ల మాటలపట్ల సిగ్గనిపించి ఉండోచ్చు. అలాగే ఎవరైనా విమర్శించినా మంచిదే వాటిలో నిజాయితీ ఉందనిపిస్తే, ఒక వేళ మనం పోరపాటు చేశామో చూసుకోవచ్చు కదా.అన్నింటి కంటె ముఖ్యం మనం ఎప్పుడు ఎదుటి వాళ్లను మొప్పించలేం.అది మన ఉద్యోగం కాదు.
Categories