పిల్లల ఆత్మవిశ్వాసం పెరగాలంటే వాళ్ళు అదే పనిగా హితబోద చేయడం కాదు వారి పట్ల చూపే ప్రేమలోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.వాళ్ళకు అన్ని వేళలా తోడుగా ఉంటామనే మానసిక ధైర్యాన్ని పిల్లలు పెంచాలి.ఒక స్పర్శతో వాళ్ళ విశ్వాసాన్ని పొందవచ్చు.వాళ్ళతో మాట్లాడే సమయంలో కళ్ళలోకి చూస్తూ మాట్ల్లాడాలి. అప్పుడే మన మనసులో ప్రేమ వాళ్ళకి అర్ధమవుతుంది.వాళ్ల కోసం వీలైనంతసమయం కేటాయించాలి. అప్పుడే అనుబంధం పెరుగుతుంది.వాళ్ళు విసిగించినా ఇబ్బంది పెడుతున్నా ఒక దెబ్బ వేయడం కోప్పడటం చాలా తప్పు. కాసేపు మౌనంగా ఉండి లేదా వాళ్ళ సమస్య ఏదో విని సాధ్యమైనంతవరకు పరిష్కరిస్తేనే పిల్లలకు పెద్దవాళ్ళ పై నమ్మకం పెరుగుతుంది.

Leave a comment