పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన బోయింగ్ 737 విమానంలో ఇంజన్ లో మంటలు వచ్చాయి . పైలెట్ మోనికా ఖన్నా ప్రతిభతో నిమిషాల్లో తిరిగి ల్యాండింగ్ చేసి 185 మంది ప్రాణాలను కాపాడింది . మోనికా ఖన్నా ది పంజాబ్ . ఎం బి ఏ  చదువుకొంది . పైలెట్ గా శిక్షణలో ఉన్నపుడే ధైర్యసాహసాలు ఉన్న యువతి గా పేరుతెచ్చుకొన్నది . ఆదివారం నాడు పాట్నా నుంచి బయలుదేరిన విమానాన్ని పక్షి ఢీకొనటంతో మంటలు వచ్చాయి . మోనికా ఇంజన్ ఆపేసి ఇంకో ఇంజన్ ఆన్ చేసి విమానాన్ని తిరిగి పాట్నా చేర్చింది . సురక్షితం గా విమానాన్ని ల్యాండ్ చేయటానికి 18 నిముషాలు పట్టింది . ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొన్న ప్రయాణికులను భద్రంగా నేల పైన దించింది  మోనికా .

Leave a comment