భారత్ నుంచి మరింత ఎక్కువ మంది చెస్ చాంపియన్ లు రావాలని కోరుకుంటున్నా. చెస్ లో ఆడపిల్లలకు నేను ఇచ్చే స్ఫూర్తి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా అంటారు హంగేరీ కి చెందిన జుడిత పోల్గర్. చదరంగం చరిత్రలో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఈమెను గుర్తించి చెబుతారు. 15 ఏళ్లకే ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ గా 26 సంవత్సరాల పాటు మహిళల ప్రపంచ నెంబర్ వన్ గా ఆమె క్రీడా స్ఫూర్తి అనితర సాధ్యం విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్ సన్ వంటి క్రికెట్ దిగ్గజాలను ఆమె ఓడించారు. 2014 లో రిటైర్మెంట్ ప్రకటించారు ఆమె ప్రస్తుతం ఫిడే టోర్నీ లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. హంగేరి కి చెందిన అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ స్టీఫెన్ ఆఫ్ హంగేరీ ని అందుకొన్నారు జుడిత పోల్గర్ .

Leave a comment