నీహారికా, కరెక్ట్ గా చెప్పావు. నిముషానికో వాట్సప్ మెసేజ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ కదా న్యూస్ అలర్ట్ లు వస్తాయి. మెసేజులు, ఫోనులు, చదువు, పార్ట్ టైం జాబ్... అసలు ఏకాగ్రత ఒక్క పని మీద కూడా వుండటం లేదు అన్నావు. నిజమే ఇన్ని విషయాల మధ్య పని పై తదేక ధ్యాస నిలపటం కష్టం. కానీ అలవాటు చేసుకోవాలి. ప్రాధాన్యం లేని విషయాలు మనసు నుంచి, పరిసరాల నుంచి దూరం చేస్తేనే అసలైన వాటి పైన శ్రద్ధ పెట్టగలం. కాబట్టి రోజులో మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని గుర్తించి మిగతా అన్నింటినీ పక్కన పెట్టాలి. నిద్ర లేచాక ఎప్పుడూ మనసు ఫ్రెష్ గా అనిపిస్తుందో అప్పుడు కీలకమైన పనులు చేయాలి. కానీ ఒక్కటే పని ఎంచుకోవాలి. మల్టీ టాస్కింగ్ ఏకాగ్రతకి శత్రువు. ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఓ పేపర్ పైన ఈ రోజు ఉన్న పనులన్నీ రాసుకుని ముఖ్యం కానివి కొట్టేస్కో. అవసరమైన పనికి ఎంత టైమ్ కేటాయించాలో తేల్చుకొని, ఇక ఆ పని మొదలు పెట్టి ఆ పని అయ్యే దాకా ఫోన్లు, మెసేజులు, స్విచ్ ఆఫ్ పెట్టినా లేదా ఫోన్ మ్యూట్ లో పెట్టినా చాలు అలాగే చేస్తున్న పనికాక రెండో పని రెండు చేతులతో చేయాలని చూడొద్దు. ఇక వరసగా ప్రాధాన్యత క్రమంలో పనులు చక్కబెడితే ఇక మిగిలిన టైం కబుర్లకు, ఫోన్ లకు, ఫ్రెండ్స్ కు కేటాయించుకో ఏమంటావు?
Categories
Nemalika

అతి ముఖ్యమైన పనేదో ఎంచుకొంటే చాలు

నీహారికా,

కరెక్ట్ గా చెప్పావు. నిముషానికో వాట్సప్ మెసేజ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ కదా న్యూస్ అలర్ట్ లు వస్తాయి. మెసేజులు, ఫోనులు, చదువు, పార్ట్ టైం జాబ్… అసలు ఏకాగ్రత ఒక్క పని మీద కూడా వుండటం లేదు అన్నావు. నిజమే ఇన్ని విషయాల మధ్య పని పై తదేక ధ్యాస నిలపటం కష్టం. కానీ అలవాటు చేసుకోవాలి. ప్రాధాన్యం లేని విషయాలు మనసు నుంచి, పరిసరాల నుంచి దూరం చేస్తేనే అసలైన వాటి పైన శ్రద్ధ పెట్టగలం. కాబట్టి రోజులో మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని గుర్తించి మిగతా అన్నింటినీ పక్కన పెట్టాలి. నిద్ర లేచాక ఎప్పుడూ మనసు ఫ్రెష్ గా అనిపిస్తుందో అప్పుడు కీలకమైన పనులు చేయాలి. కానీ ఒక్కటే పని ఎంచుకోవాలి. మల్టీ టాస్కింగ్ ఏకాగ్రతకి శత్రువు. ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఓ పేపర్ పైన ఈ రోజు ఉన్న పనులన్నీ రాసుకుని ముఖ్యం కానివి కొట్టేస్కో. అవసరమైన పనికి ఎంత టైమ్ కేటాయించాలో తేల్చుకొని, ఇక ఆ పని మొదలు పెట్టి ఆ పని అయ్యే దాకా ఫోన్లు, మెసేజులు, స్విచ్ ఆఫ్ పెట్టినా లేదా ఫోన్ మ్యూట్ లో పెట్టినా చాలు అలాగే చేస్తున్న పనికాక రెండో పని రెండు చేతులతో చేయాలని చూడొద్దు. ఇక వరసగా ప్రాధాన్యత క్రమంలో పనులు చక్కబెడితే ఇక మిగిలిన టైం కబుర్లకు, ఫోన్ లకు, ఫ్రెండ్స్ కు కేటాయించుకో ఏమంటావు?

Leave a comment