నీహారికా ,

పిల్లలను ఎంతో పేమించటం మంచిదే కానీ అలా ప్రేమ పేరుతో అస్తమానం కనిపెట్టుకుని ఉండటం వల్ల  ఆ పిల్లలకు ఆశించిన మేలు కలుగదంటున్నాయి పరిశోధనలు. పిల్లలను ఎంతవరకు ప్రేమించాలి అన్నావు . సాధారణ శ్రద్ధ  తీసుకుని ప్రేమించాలన్నది నా సమాధానం. అతి శ్రద్ధ వద్దు. ప్రతి పనికీ ఇతరుల పైన ఆధారపడే అలవాటు చేయకూడదు. పిల్లలకు అవసరాలు సమకూర్చుతూ బాధ్యతలు తీసుకుంటూ వాళ్ళ ముందు స్పష్టమైన లక్ష్యం ఉంచాలి. వాళ్ళని స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఇస్తేనే అది సరైన పెంపకం  అంటారు మానసిక నిపుణులు. తండ్రి పిల్లవాడి చేయి పట్టుకోవాలి. కరెక్టే. కానీ ఎప్పుడు వదాలలో కూడా తండ్రికి తెలియాలి. జీవితం కూడా పిల్లలు నడక నేర్చుకోవటం వంటిదే. ఆ అడుగులు సక్రమంగా వేస్తున్నాడా లేదా నాయి నేర్పే శిక్షకులుగా మార్గదర్శకులుగా ఉండాలి . తల్లితండ్రులు. అంతే కానీ ప్రతి అడుగు కలిసి వేయాలనుకోకూడదు. వారికీ మంచి భవిష్యత్తు అందే  అవకాశాలు చూపించాలి. చక్కని పాటశాలలో చేర్చాలి. వారు శ్రద్ధగా చదువుకునే దిశగా ప్రోత్సహించాలి. చదువుతో పాటు ఎన్నో టాలెంట్స్ ప్రోత్సహించాలి . వారి జీవితాన్ని విజయంవైపుగా నడిపించాలి. తల్లితండ్రుల బాధ్యత అదే !

Leave a comment