రోజు మొత్తం బిజీ షెడ్యుల్స్ ఇల్లు, ఆఫీస్, కాస్తో కూస్తో సమయం చిక్కితే చిన్నా చితకా షాపింగ్ లో వీటికే సమయం చాలడం లేదు. ఇక వ్యాయామాలు ఎక్కడ చేస్తాం అనుకొంటారు సాదరణంగా స్త్రీలు కానీ ఎక్స్ పర్ట్స్ ఏం చెప్పుతున్నారంటే రోజుకు ఇరవై నిమిషాల వర్కవుట్ చేస్తే చాలు. ఇదే శరీరం పై గొప్ప ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. ఎక్కువ ఇంటెన్సిటీ తో చేసే తక్కువ వ్యవధి వ్యాయామాలు ప్రభావం చూపెడతాయంటున్నారు నిపుణులు. జిమ్ కు వెళ్ళకపోయినా పర్లేదు. ఇంట్లో త్రెడ్ మిల్ పైన, లేదా కొన్ని స్ప్రింట్స్ చేస్తే అన్నీ మెరుగైన ఫలితాలే. అలాగే వ్యాయామాల కారణంగా మంచి నిద్ర కూడా పడుతుంది. సాధారణంగా వ్యాయామం అతిగా చేస్తే జీవ క్రియలు మందగించి బరువు పెరిగే ప్రమాదం కూడా వుంటుంది. అందుకే వ్యాయామానికి కొద్ది సమయం కేటాయిస్తే చాలు.
Categories