మొక్కలు పెంచటం అందరకి ఇష్టం. కుండీలు పెట్టుకునే సౌకర్యం లేని ఇళ్ళు. అపార్ట్మెంట్ లో వున్న చిన్న సిటవుట్ లో కుండీలు పెట్టలేము. ఒక వేళ పెట్టినా ఆకాశమంటే ఇళ్ళ మధ్యకి ఎండ ఎక్కడ నుంచి వస్తుంది. ఇలాంటి అలా సరదా వుండీ, చోటు లేక అయ్యో అనుకొనే వాళ్ళకోసం లివి, ఈడెన్ సక్షన్ ప్లాంటర్లు వచ్చాయి. ఈ కుండీల వెనక వుండే రబ్బరు నిర్మాణం సయం తో వీటిని నునుపుగా వుండే అద్దాల గోడలు టైల్స్ కి సులభంగా అంటించ వచ్చని స్థలం లేదన్న సమస్య వుండదు. ఎక్కువ ఎండ ఎక్కడ పడితే అక్కడికి మార్చుకోవచ్చు. లేదా ఒక పెద్ద సైజు ఇంకో చిన్న సైజు కొని గోడకి అతికించిన కుండీ తీసేయ కండి లోపల పెట్టిన చిన్న కుండీలో మొక్కలు కాసేపు ఎండలో పెట్టొచ్చు. నీరు ఎక్కువగా పోసినా కింది కుండీలోకే కారుతుంది. జాగ్రత్తగా క్లీన్ చేసుకోవచ్చు. డ్రాయింగ్ రూమ్లో ఇంకెంత బావుంటుందో. హాలు గోడకి పచ్చని గడ్డి మొలిస్తే ఎంత బావుంటుంది. వంటగదిలో కొత్తిమీర, పుదినా వంటివి పెంచుకోవచ్చు.

Leave a comment