అతి ఎప్పటికి అనర్థమే అంటారు . చాలా మంది తల్లులు మట్టిలో ఆడరనో ,ఏదైనా ముట్టుకొన్నారనో పిల్లల చేతులు పదేపదే కడుగుతుంటారు . ఇందువల్లనే అనేక వ్యాధులకు గురవుతారు అంటారు పరిశోధకులు . పెద్దవాళ్ళ శరీరంలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు సహజీవనం చేస్తాయి . వాటిలో కొన్ని శరీర ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి . ఇలాంటి సూక్ష్మజీవులు చేతుల ద్వారా నే కడుపులోకి చేరతాయి . ఇంత మంచి సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించే వీలులేకుండా వాళ్ళ చేతులు కడగటం తావుంటున్నారు . పుట్టుక నుంచే ,శ్వాస క్రియ ద్వారా నీరు ,ఆహారం కొన్ని ప్రో బయోటిక్ ఔషధసేవనం ద్వారా సూక్ష్మక్రిములు దేహంలోకి ప్రవేశిస్తాయి . శరీరంలో రోగ నిరోధక వ్యవస్థకు ,రోగకారక క్రిములను ఎదుర్కొనేందుకు అవసరం అయ్యే వివిధ యంతంగాలను పటిష్ట పరుచుకునేలా చేస్తాయి ఈ మంచి సూక్ష్మజీవులు . అతి శుభ్రతతో ఇవి శరీరంలోకి చేరకుండా పోతాయి .

Leave a comment