నిద్ర తక్కువైతే ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కలుగుతుందని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పుతున్నారు. వీళ్ళు ఆత్మహత్యల ఆలోచనలు ఎందుకొస్తాయనే అంశం పైన 13 సంవ్సత్సరాలు సుదీర్ఘ అధ్యయనం కొనసాగించారు. ఈ సంవత్సరంలో మూడు వేలమంది ఆత్మ హత్య చేసుకున్నారని ఓ రిపోర్ట్ తేల్చిందిట. వాటిలో 19 శాతం మంది అనారోగ్యాల కారణంగానూ 20 శాతం మంది మానసిక రుగ్మతులతోనూ పది శతం మంది నిద్రలేమి కారణంగా వత్తిడి , ఆందోళన ఎక్కువై ఆత్మహత్య ఆలోచన చేసారని అధ్యాయినాలు తేల్చాయి. మామూలు వ్యాధుల కన్నా , మానసిక సమస్యలు వున్నవాళ్ళు ఎక్కువమంది ఆత్మహత్య ఆలోచనలతో ఉంటే పదిశాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు.

Leave a comment