కేరళ టూరిజం నిర్వహించే స్వర్గాలయ క్రాఫ్ట్ విలేజ్ ఓసారి ఆన్ లైన్లో చూడండి. హ్యాండ్ లూమ్ టెక్స్టైల్స్ జ్యూవెలరీ శిల్పాలు ఆధునికమైన బ్యాగ్స్ యాక్సెసరీస్ ఎన్నెనో అందమైన వస్తువులున్నాయి. కొబ్బరి పీచు అరటి వెదురు ఫైబర్ కొబ్బరి చిప్పలు గవ్వలతో చేసిన ఎన్నో కళాఖండాలున్నాయి. సంప్రదాయ క్రాఫ్ట్ తో  పాటు ఆధునికమైన వస్తువులు ఎన్నో వున్నాయ్. ఈ స్వర్గాలయ  క్రాఫ్ట్ విలేజ్ కొజె కోడి ,కన్నూర్ జాతీయ రహదారి పైన ఇరంగల్ వద్ద 20 ఎకరాల విస్తరంలో 27 కాటేజీలున్నాయి. కొత్త సంవత్సరం కోసం ఆత్మీయులకు ఏదైనా ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలాంటివి వెతకాలి. ప్రపంచపు ఏ మూల నుంచైనా ఆన్ లైన్లో వేలు పెట్టేసి ఆత్మీయుల ముంగిటికి ఇచ్చేయమనచ్చు . అవేనా ? మన కొండపల్లి బొమ్మల దగ్గరనుంచి కాకినాడ వరకూ దేన్నయినా పంపచ్చు ఏమంటారు ?

Leave a comment