Categories
Gagana

అట్టడుగు నుంచి అపూర్వ విజయం.

చదువు అయిపోగానే వైట్ కాలర్ జాబ్ ఆలోచన మారిపోయింది. నిబద్ధతతో కష్టపడితే దేన్నయినా సాధిస్తామనే స్ఫూర్తిదాతలతో ప్రపంచంలో కొందరి ఉనికి కనిపిస్తుంది. వందల వేల స్టార్టప్ లు హైదరాబాద్ నగరంలో. ఒక కొత్త బిజినెస్ సంస్కృతి ఇప్పటికే మొదలైంది. కొంతమంది ఈ ఆలోచన కూడా రాణి చోట వాళ్ళ జీవనం కోసం కూడా చిన్న వ్యాపారం మొదలుపెట్టి పైకి ఎదిగారు. వ్యసనాల బారినబడ్డ భర్త పెట్టే హింసలతో వైవాహిక జీవితం దుర్భరమై ఇద్దరు పిల్లలతో రోడ్డున పడ్డారు పాట్రీషియా నారాయణ్. వాళ్ళ పోషణ కోసం చెన్నయ్ లోని మెరీనా బీచ్ వద్ద ముప్పయ్ ఏళ్ల క్రితం తోపుడు బండి పైన తినుబండారాలు అమ్మడం మొదలు పెట్టిందామే. ఆనాడు ఆమె రోజు వారి ఆదాయం అర్ధ రూపాయి. క్రమంగా ఇద్దరు సిబ్బందితో చిన్న హోటల్ పెట్టిన ఆమె ఇప్పుడు చైన్ రెస్టారెంట్స్ కు యజమాని. రోజువారీ ఆదాయo లక్షల్లోనే. ఇలాంటి స్ఫూర్తి దాతల నుంచి ఉత్తేజం నింపుకొన్న స్టార్టప్ లు తొందర తొందర గానే పుంజుకొంటున్నాయి.

Leave a comment