వంట గదిలో కాస్త ఎండపడే గోడపైన ఈ ఈడెన్ సెక్షన్ ప్లాంటర్లు అతికిస్తే వంటగది రూపం ఆహ్లాదంగా మారిపోతుంది . తిరగమోతల ఘాటులో, సాంబారు ఘుమ ఘుమ లలో ఉక్కిరి బిక్కిరి అయ్యేచోట గోడ పొడవునా చిన్న కప్పుల్లో అలంకరణ మొక్కలో లేదా కొత్తిమీర పుదీనా వంటి మొక్కలో ఉంటే ఎంతో బావుంటుంది . అద్దాలు,టాయ్ లెట్స్ గోడలకు అతికించేట్లు ఈ కుండీల వెనుక ఒక రబ్బరు నిర్మాణం ఉంటుంది ఈ రబ్బరు గట్టిగ ఉండి రాకుండా అతుక్కు పోతుంది . కొన్ని కుండీలు ఒకదాన్లో ఒకటి ఉంటాయి . లోపల కుండీలో పోసిన మట్టిలో నీరు ఎక్కువైతే క్రిందికి కారిపోకుండా గోడకు మరకలు అవకుండా ఉంటుంది . పచ్చదనం కళ్ళ నిండా కనబడాలి అనుకొంటే ఈ కుండీలు తెచ్చేయచ్చు .

Leave a comment