కుంభకోణం తాంజావూరు కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అడుగడుగుకు ఓ దేవాలయం ఉన్న పుణ్యక్షేత్రం ఇది. చోళుల రాజధానిగా చరిత్రలో కనిపిస్తుంది.గణిత మేధావి శ్రీనివాసరామానుజన్ పుట్టి పెరిగింది ఇక్కడే. పూరాతన ప్రదేశం కాబట్టి పలు శతాబ్దాల్లో నిర్మించిన దేవాలాయలు కనిపిస్తాయి. ఆదికుంభేశ్వర మందిరం పట్టణం మధ్యలో ఉంటుంది. మంత్ర పీఠేశ్వరి,మంగళాంబికగా పూజలందుకుంటుంది. దేవాలయం చాలా పెద్దది. ఏడువందల యాభై అడుగుల పొడవు 252 అడుగుల వెడల్పుతో ప్రాంగణం మూడు వైపుల గోపురాలు మూడు ప్రాకారాలు ఉంటాయి. ఇది అత్యంత పూరాతన దేవాలయం.

Leave a comment