ప్రకృతి సహజంగా దొరికే ఎన్నో పండ్లలో అంతులేని ఔషధ గుణాలున్నాయి . ఫైనాఫిల్ లో బ్రుమెలియన్ అనే పదార్ధం ఉంటుంది . ఇది శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది . కొంత మందికి ఏ పనిచేస్తున్నా కాళ్ళు చేతులు తరుచుగా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి . అలాటి వాళ్ళు ఫైనాపిల్ తింటే మంచి ఫలితం ఉంటుంది . మోకాళ్ళు నొప్పులు ఆర్థరైటిస్ తో బాధపడేవాళ్ళకి ఈ పైనాపిల్ చాలా మేలిస్తుంది . రక్త ప్రసరణ బాగా జరగటంతో నరనరాలకు స్వాంతన లభించి నొప్పులు తగ్గిపోతాయి . ఒక రకంగా పెయిన్ కిల్లర్ చేసే పని ఈ అనాస పండు చేసేస్తుంది .

Leave a comment