ఇంత చిన్న జీవితంలో అన్ని ఘనవిజయాలు ఎట్లా సాధించారు అనిపిస్తుంది .రచయిత్రి బార్బరా కార్ట్ లాండ్ సాహిత్యం ప్రపంచ ప్రసిద్ధి .అద్భుతమైన శృంగార నవలలు రాశారామె .ఆమె రాసిన 723 నవలలు 31 భాషల్లోకి అనువాదం చేశారు .1991 నాటికీ ఆమె పుస్తకాలు అరవై కోట్ల ప్రతులు అమ్ముడుపోయి ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లలోకి ఎక్కారు .ఆమె 93 వ జన్మదినం రోజున తన 600 వ పుస్తకాన్ని తన స్నేహితుల మధ్య ఆవిష్కరించారంటే ఆమె ఆ వయసులో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు అనుకోవాలి .జీవించినంత కాలం ఆమె ఆరోగ్యం పైన ఎంతో శ్రద్ధ తీసుకొనే వారట .వృద్దాప్యం వల్ల మొహం పై వచ్చే ముడతల్ని నివారించేందుకు ప్లేమ్ అనే సౌందర్య సాధనం వాడేవారట బార్బరా .ఇప్పటికీ ఆమె నవలలు రీప్రింట్స్ వస్తూనే ఉంటాయి .

Leave a comment