Categories
Gagana

అవకాశాలున్నంత వరకు యాక్టర్ నే.

ప్రేమమ్ లో మలర్ గా నటించి కేరళ ప్రేఅక్షకుల మనస్సు దోచుకున్న సాయి పల్లవి ఫిదా లో తెలంగాణా యాసలో మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊటీ ప్రక్కన కోటగిరిలో పుట్టిన సాయి పల్లవి మంచి డాన్సర్. రియాలిటీ షోల్లో పాల్గొని సినిమా అవకాశాలు తెచ్చుకుంది రెండు చక్కని సినిమాల్లో నటించి, చిత్ర జగత్తులో చూటు చేసుకుంది. ఉదయాన్నే లేచి గాయత్రీ అమ్న్త్రం జపించి, యోగా మెడిటేషన్ చేస్తానని చెప్పే సాయి పల్లవి పూర్తి స్ధాయి యాక్టర్ గానే కొనసాగాలనుకున్నానని చెప్పుతుంది. మెడిసిన్ చదివింది. సినిమా ఫేమ్ ఇన్నాళ్ళూ వుంటుందో తలియదు. కానీ మనిషిగా ఎప్పుడైనా నిలదొక్కుకోవాలటానికి విద్య పనికి వస్తుందని పెద్దలు చెప్పిన మాట నచ్చిందని అందుకే మెడిసిన్ పూర్తి చేసానని కార్దియాజిస్ట్ కావాలని తన కోరిక అనీ, కానీ సినిమా అవకాశాలు వస్తే మటుగు యాక్టర్ నే అని చెప్పుతుంది సాయి పల్లవి.

Leave a comment