చెన్నై కు చెందిన కృష్ణ జయశంకర్ యు.ఎస్.ఎ లో జరిగిన మౌంట్ వెస్ట్ ఇండోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలుచుకొని నేషనల్ రికార్డ్ నెలకొల్పింది. ఆమె తండ్రి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు తండ్రి పోలికలు శరీర సౌష్టవం ఆమెకు వచ్చింది దానితో బాగా ఎత్తు లావుగా ఉండేది. అస్తమానం ఆమెను అమ్మాయిల లేవు అని తోటి వాళ్లు వేధించేవాళ్లు ఇదంతా తన ఆరోగ్యం పైన ప్రభావం చూపెడుతోందని గ్రహించిన కృష్ణ తండ్రి లాగే క్రీడల్లో రాణించాలనుకుంది. జమైకా డిస్కస్ త్రో లో శిక్షణ తీసుకుంది.ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో  చదువు తో పాటు క్రీడా శిక్షణ కూడా కొనసాగిస్తుంది. బాడీ షేమింగ్ తనలో ఆత్మవిశ్వాసం వచ్చేలా చేసింది అంటుంది కృష్ణ జయశంకర్.

Leave a comment