అడ్వార్టైజ్మెంట్స్ చూసో  అలవాటుగానో సౌందర్య ఉత్పత్తులను కొంటారు. వాటిని ఎంత మోతాదు లో వాడాలో రాసివుండదు కనుక తోచినంత రాస్తూ వుంటారు. ఈ ఉత్పత్తి ఈ మోతాదులో రాసుకుంటే ఫలితం ఉంటుందో ఎలా ఉపయోగించాలి. అప్పుడే సరైన ఫలితమ్ కనిపిస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసే క్లీన్సర్ ని రెండు బఠాణీ గింజల పరిమాణంలో తీసుకోవాలి. అందులో దూది ముంచి రాస్తే ముఖం పైన తేలికగా పరుచుకునేంతగా  సరిపోతుంది. మిలిగిలినది మీద భాఫానికి సరిపోతుంది. సీరమ్  లేదా చర్మ చికిత్స కు వాడే క్రీములు వేలిపైకి తీసుకుని ముఖానికి ఎక్కడ అవసరమో అక్కడే రాయాలి. తక్కువే రాస్తే మంచిది. మొహం మొత్తం పరుచుకోకుండా చూడాలి. మృతకణాలను తొలగించే పూతైతే అందులో రసాయనాలు ఉంటాయి కనుక వేలితో చాలా  తక్కువ పరిమాణంలో తీసుకుని వారానికి ఒక్కసారి మాత్రమే రాయాలి. అదే సహజమైన పదార్ధాలతో చేసిన దైతే వారానికి మూడు సార్లు రాసినా  నష్టం లేదు. దేనినెంత వాడాలో తెలుసుకుంటే ఉపయోగం.

Leave a comment