కార్బోహైడ్రేట్స్ పేరు ఎత్తితే ఆమ్మో అంటారు అమ్మాయిలు డయాబెటిస్ ,ఒబిసిటీ అంటూ వీటికి చాలా దూరంగా ఉంటున్నారు . అయితే కార్బోహైడ్రేట్స్ మెదడు ఆరోగ్యానికి అత్యంత అవసరం అంటారు పరిశోధకులు. కార్బోహైడ్రేట్స్  తీసుకొనే వారిలో మెదడు పని తీరు బావుండటంతో పాటు మతిమరుపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని అధ్యయనాల్లో గుర్తించారు . అంతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్వల్ల గుండె ఆరోగ్యం చాలా బావుంటుందని ఆయుః ప్రమాణాలు పెరుగుతాయని వివరించారు . ఇతరత్రా ఆరోగ్య సమస్యలు లేనివాళ్ళు కూడా పూర్తిగా ప్రొటీన్ల పై ఆధారపడకుండా కార్బోహైడ్రేట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు .

Leave a comment