శరీరం బరువుతో ఉన్నవాళ్ళు మధుమేహానికి గురవుతుంటారని పరిశోధకులు ఏనాడో చెప్పారు. ఇప్పుడు శరీరం బరువు ,మధుమేహహం కూడా అవకాడో నియంత్రించగలదని పరిశోధనలు చెపుతున్నాయి . కొవ్వుని కరిగించే ఆక్సీకరణ ప్రక్రియ సరిగ్గా జరగక పోవటం వల్ల ఇన్సులిన్ నిరోధం ఏర్పడి మధుమేహానికి దారి తీస్తుంది . అవకాడో తినేవాళ్ళలో కాలేయం,మూత్రపిండాల పనితీరు,కండరాల పనితీరు చాలా బావుందని  పరిశోధకులు గుర్తించారు . రోజుకో అవకాడో తిన్నా వాళ్ళలో చెడు కొలెస్ట్రాల్ తగ్గింది . ఇందులోని ల్వుటెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించింది . అలాగే అవకాడో కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు గుర్తించారు .

Leave a comment