కలకాలం నిలిచేవి మనం చేసే పనులే నిజాయతీకి ఎప్పుడూ ఒక పురస్కారం ఉంటుంది. ఒక చిన్న పనితో నలుగురు ముఖ్యమంత్రుల నుంచి ప్రశంశలు పురస్కారాలు అందుకొన్నారు. ప్రజల అభిమానం పొందాను అంతకన్నా ఇంకేం కావాలి అంటుంది పోలీస్ ఇన్స్పెక్టర్ సత్యవతి. చెన్నై లోని టి పి చత్రం ఇన్స్పెక్టర్ గా ఉన్న సత్యవతి ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో చెట్లు కొమ్మలు పడి నీళ్లలో అచేతనంగా పడి ఉన్న ఒక యువకుడిని భుజాలపైన మూసుకుంటూ ఆసుపత్రికి తీసుకు వెళుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి ముఖ్యమంత్రి ఆమెను అభినందించారు.1991లో పోలీసు శాఖలో అడుగుపెట్టాక సత్యవతి తన సేవ లతో నలుగురు ముఖ్యమంత్రులు ప్రశంసలు పొందారు.

Leave a comment