వివిధ రంగాల్లో సేవలందించిన మహిళల దీక్షా దక్షతలను గౌరవిస్తూ రాష్ట్రపతి నారీశక్తి పురస్కారం అందించారు బీహార్ లోని ముంగర్ కు చెందిన వీణాదేవి ని ఈ సత్కారం వరించింది . ఈమెను మష్రూమ్ మహిళగా పిలుస్తారు . మహిళలకు సేంద్రియ పద్దతిలో పుట్ట గొడుగులు పండించటం మేకల పెంపకంలో శిక్షణ ఇచ్చారు వీణాదేవి . వంద గ్రామాల్లోని సుమారు 1500 మంది మహిళలను పుట్ట గొడుగుల రైతులుగా తీర్చిదిద్దింది . మహిళలు నిర్ణయించు కొంటె తాము ఉన్నచోటు నుంచే ప్రయాణం ప్రారంభించ వచ్చు . వ్యవసాయం నుంచే నేను నా ప్రయాణం ప్రారంభించి సర్పంచ్ నయ్యారు . ఈ రోజు ముంగేర్ మహిళలు మహిళాసాధికారతకు  ఉదాహరణగా మారారు అంటుంది వీణాదేవి .

Leave a comment