ప్రైజ్ ఫర్ ఉమెన్స్ క్రేయేటివిటీ ఇన్ రూరల్ లైఫ్ పురస్కారం అందుకొంది షబ్నమ్ షా. ఆదివాసీలు హక్కుల కార్యకర్తగా 1500 కుటుంబాలకు వారి భూమి హక్కులు అందేలాచేశారామె. మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ జిల్లా మంగోలి గ్రామం షబ్నమ్ సొంత ఊరు ఏక్తా పరిషత్ జిల్లా కు కోఆర్డినేటర్ గా పనిచేస్తారామె. వంద గ్రామాల్లో ఆరువేల మంది ఆదివాసీలు పేదల కోసం పనిచేస్తోందీ ఈ సంస్థ.  స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉమెన్స్ వరల్డ్ సమ్మిట్ ఫౌండేషన్ ప్రతి ఏటా గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను మెరుగు పరిచే మహిళా నాయకులకు ఇచ్చే ప్రైజ్ ఫర్ ఉమెన్స్ క్రేయేటివిటీ ఇన్ రూరల్ లైఫ్ పురస్కారం ఈ సంవత్సరం షబ్నమ్ కు ఇచ్చారు.

Leave a comment