రహస్యంగా పెళ్లి ఎందుకు చేసుకొన్నారు ,మీ అభిమానులకు చెపితే సంతోషించే వాళ్ళు కదా అని అడిగితే శ్రీయ నవ్వేసింది అయన రష్యా వ్యాపారి . చాలా కొద్దిమంది మధ్యనే సంవత్సరంన్నర క్రిందట మా పెళ్ళి జరిగింది . ఆయనకు ఈ పరిశ్రమతో సంబంధాలు లేవు . ఇది రహస్యం అని కాదు కానీ కాస్త పర్సనల్ గా ఉంచుకొన్నాను . పెళ్ళి నా వ్యక్తిగత విషయం కదా . మా మధ్యనే ఉంటేచాలు అనుకొన్నాం . అంతకంటే వేరే కారణం లేదు . సినిమాల నా వృత్తి . ఈ విషయంలో నా భర్త ఎంతో సపోర్ట్ గా ఉంటారు . ఇంకా ఎక్కువ సినిమాలు చేయమని సలహా ఇస్తారు కూడా అని సంతోషంగా చెపుతోంది శ్రీయ .

Leave a comment