కల్కి సినిమా కు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్ అర్చన రావు.హైదరాబాద్ నిఫ్ట్ లో న్యూయార్క్ లో చదువుకున్న అర్చన కు ఆమె పేరుతో సొంత బ్రాండ్ ఉంది. దుస్తులే కాదు, ప్రోడక్ట్ డిజైనర్ కూడా. మహానటి చిత్రం కోసం 1940,1980 నాటి ఫ్యాషన్ దుస్తులు తయారు చేసి జాతీయ అవార్డ్ తీసుకొన్నది. కల్కి సినిమా కోసం మూడు రకాల ప్రపంచాలకు సరిపోయే దుస్తులు తయారు చేసింది అర్చన. మహాభారత కాలం నాటి అశ్వద్ధామ వేషంలో ఉన్న అమితాబ్ కోసం దుస్తులు తయారు చేయటం కోసం ఎంతో శ్రమ తీసుకొన్న అంటుంది అర్చన. ఆయనను చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్లు అనిపించాలనే కోరిక తో ఆయన దుస్తులు తయారు చేశాను అంటుంది అర్చన రావు.

Leave a comment