చర్మంలోని నూనె ఉత్పత్తి తగ్గిపోయి నీటి శాతం తగ్గటం వల్ల పొడి బారి పోతుంది. ఇది ఇతరాత్రా కారణాల వల్లనూ , వారసత్వం వల్లనూ కావచ్చు . పొడి బారిన చర్మానికి మాయిశ్చరైజ్ చేసుకోవటం చాలా ముఖ్యం . చర్మంలోని ఆయిల్ లెవల్స్ మెయిన్ టెయిన్ చేయాలి.  అలాగే సాధారణ క్రీమ్స్ స్థానంలో ఆయిల్ క్రీమ్స్ వాడాలి.  అలాగే లోషన్లు వాడితే సౌకర్యం అనుకొంటే అవి రోజుకు రెండు మూడుసార్లు అప్లై చేయవచ్చు . షియా బటర్ సహాజమైన నూనెలు విటమిన్ ‘ఇ’ ఉన్నా మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. అలాగే తేలికపాటి జెల్ ఆధారిత సబ్బు వాడటం మంచిది.

Leave a comment