ఆయుర్వేద స్నానం చేయండి ,అది శ్రమను మరిచిపోయేలా చేస్తుంది అంటున్నారు వైద్యులు.నీళ్లలో గంధంపొడి, మల్లెలు, గులాబీలు వేసుకుని స్నానం చేస్తే శరీరం చక్కని సువాసనతో ఉంటుంది.అలాగే కమలాపండు లేదా నిమ్మ తొక్కలను వేడి నీళ్ళలో వేస్తే ఆ నీళ్లకు ఆ వాసన పడుతోంది.ఆ నీళ్ళతో స్నానం శరీరాన్ని తేలిక చేస్తుంది.వేడి నీళ్లలో పసుపు వేపాకులు వేసి స్నానం చేస్తే  నీళ్లలోని క్రిములు నశించి పోతాయి.గోధుమ పిండి ఓట్స్ సమానంగా తీసుకోని దీనిలో చిటికెడు పసుపు కొద్దిగా మీగడ కొబ్బరి నూనె కలబంద గుజ్జు వేసి ఈ మిశ్రమాన్ని గులాబీ నీటితో కలిపి ఒంటికి రాసుకొని ఆరేంతవరకు ఉండి చేతికి తడి చేసుకుని మర్దనా చేసుకోవాలి ఆ తర్వాత స్నానం చేస్తే శరీరం పైన అవాంఛిత రోమాలు పోయి చర్మం మెరిసిపోతుంది.

Leave a comment