వెల్లుల్లి పాయను 60-70 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య 60 నుంచి 90 రోజుల వరకు ఉంచి దానితో నల్ల వెల్లుల్లి తయారు చేస్తారు కొరియన్ లు.  ఈ రసాయన చర్యతో వాటిల్లోని ఎంజైమ్స్ చర్య పొంది రంగుతో తియ్యదనానన్ని సంతరించుకొంటాయి. దాదాపు నాలుగు వేల సంవత్సరాలుగా దీన్ని అక్కడ వాడుతున్నారు.  థాయ్ లాండ్ లో వీటిని ఆయువు పెరిగేందుకు తింటారు.  అన్నీ వంటల్లోనూ అక్కడ ఈ నల్ల వెల్లుల్లి కనిపిస్తుంది.  దీనితో చాక్లెట్స్ కూడా తయారు చేస్తారు.  ఈ రకమైన వెల్లుల్లిలో అలిసిన్ అనే శక్తి మంతమైన పదార్థం ఉంటుంది.  ఇది చర్మసౌందర్యానికి ,జుట్టు పెరిగేందుకు తోడ్పడుతుంది.

Leave a comment