స్వామియేయీ…శరణం  అయ్యప్ప!!

బ్రహ్మచర్యంలో నిష్టాగరిష్ఠుడైన అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ప్రసాదం సేవిద్దాం రండి.
అయ్య అంటే విష్ణు మూర్తి,అప్పా అంటే శివుడు వెరసి అయ్యప్ప.మహిషాసురుని సోదరియైన మహిషి తపస్సు చేసి బ్రహ్మను వరం అడుగుతుంది,ఆ వరం విష్ణు, శివ అంశాలతో జన్మించిన వాడినే పెళ్ళాడతాను అని. క్షీరసాగర మథనంలో అమృత భాండాన్ని తీసుకుని మోహినీ రూపంలో విష్ణు మూర్తి వస్తున్నది చూసి శివుడు మోహించిన వారి కలయిక లో మణిహారంతో పంపా నదీ తీరాన చక్రవర్తికి లభించిన బాలకుడే
అయ్యప్ప స్వామి.

సవతి తల్లి ఆఙ్ఞమేరకు తలనొప్పికి దివ్యౌషధం చిరుతపులి పాలు అని వైద్యులు తెలిపడంతో అయ్యప్ప శబరిమల ప్రాంతంలో మహిషిని సంహరించి అక్కడే స్థిరపడ్డాడు.
భక్తులు మకర సంక్రాంతికి జ్యోతి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,ఆవు నెయ్యితో ప్రసాదం తీసుకుని, చాలా నిష్ఠ గా ఉండాలి.

           -తోలేటి వెంకట శిరీష

Leave a comment