అయ్యప్పన్ గా బిజు మీనన్ కోషి గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన అయ్యప్పనుమ్ కోషియం సినిమా అమెజాన్ లో సబ్ టైటిల్స్ తో చూడవచ్చు. మాజీ హవల్దార్ కోషి రాత్రిపూట అరణ్యం గుండా కారులో వెళ్తుంటాడు అట్ట వుడి లో పోలీస్ లు కారు ఆపి సోద చేస్తే ఆల్కహాల్ దొరుకుతుంది. అది నిషేధిత ప్రాంతం కనుక కోషి ని అరెస్టు చేస్తాడు ఎస్సై అయ్యప్పన్.అతను నిజాయతీ పోలీస్. కోషి కోటీశ్వరుడి కొడుకు. ఈ ఇద్దరూ ఎదురయ్యారు కోషి ని జైలుకు పంపిస్తాడు అయ్యప్పన్ ఫలితంగా నక్సలైట్స్ తో సంబంధాలున్న అయ్యప్పన్ భార్యను కేసుల్లో ఇరికిస్తాడు కోషి ఎస్సై ఉద్యోగానికి ముప్పు వస్తుంది. ఇద్దరూ అహంకారులైన మంచివాళ్ళు తలపడితే ఏమవుతుందో సినిమాలో చూడాలి. చాలా చక్కని సినిమా.

Leave a comment