టీ తాగితే హుషార్.. ఈ మధ్య ఇంకో ప్రయోజనం గుర్తించారు పరిశోధకులు. రోజు మూడు సార్లు బ్లాక్ టీ తాగేవారికి రక్తపోటు గుర్తించనంతగా తగ్గుతుందని వారు పేర్కొన్నారు. రక్తనాళాల లోపలి కణాల పనితీరును టీ  లోని పాలీ ఫెనాల్స్ మెరుగు పరుస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్  పదార్ధాలు రక్త నాళాల లోపలి కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఉదరం చుట్టూ కొవ్వును శారీరిక బరువును తగ్గించటంలో సహకరిస్తాయని తద్వారా రక్తపోటు ప్రభావితం అవుతుందని పరిశోధకులు వివరించారు . అన్ని టీ పొడులు క్వామేలియా సెన్సటివ్ పొదల ఆకుల నుంచి తయారయ్యేవే. గ్రీన్ టీ ని ఫర్మెంట్ చేయరు. కనీస మాత్రంగా ప్రాసెస్ చేస్తారు. ఈ ఆకుల్ని సింపుల్ గా స్టీమ్ చేస్తారు. బ్లాక్ టీ ని పెర్మెంట్ చేసి ఆక్సిడైజ్ చేస్తారు. ఊలాంగ్ టీ ని పాక్షికంగా ఆక్సిడైజ్ చేస్తారు. అంటే ఇది గ్రీన్ బ్లాక్  టీ లకు మధ్యస్థంగా ఉంటుంది. వైట్ టీ ని కొద్దిగా ఓపెన్ అయిన మొగ్గలు లేత ఆకులతో తయారుచేస్తారు. వీటిని స్టీమ్ చేసి డ్రై చేస్తారు. ఇది టీ ఆకుల నడుమగల తేడా ..

Leave a comment