బబుల్ గమ్ లో హానికారక ప్లాస్టిక్ అణువులు ఉంటాయని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ హజారిటీస్ మెటీరియల్స్ లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో ఒక గంట పాటు ఒక బబుల్ గమ్ నమిలిన వ్యక్తి లాలాజలంలో రెండున్నర లక్షల మైక్రో ప్లాస్టిక్స్ కనిపెట్టగలగారు. ఆటోమేటెడ్ దామన్ స్ప్రెక్టో స్కోపీ  అనే పద్ధతి ద్వారా చూయింగ్ గమ్ నమలడం వల్ల మన లాలాజలం లోకి ఎన్నో ప్లాస్టిక్ అణువులు ప్రవేశిస్తాయన్నది  అంచనా వేశారు. జీర్ణ వ్యవస్థను దెబ్బతీసే ఈ బబుల్ గమ్స్ జోలికి వెళ్ళద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Leave a comment