చిన్న పిల్లలకు స్నానం చేయించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పాపాయి పుట్టిన తొలి రోజుల్లో చర్మాన్ని సున్నితంగా ఒత్తిడి లేకుండా చేయండి మర్ధన నింపాదిగా ప్రశాంతంగా చేయాలి. చిన్నారులకు శరీరం మర్దన చేసేప్పుడు ముందు రెండు చేతులు బాగా రుద్దుకుంటే అరిచేతులు వెచ్చగా ఉండి ఆ స్పర్శ పిల్లలను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ముందుగా చేతుల గోళ్ళు తీసుకోవాలి లేకపోతే పసిపిల్లల చర్మాన్ని గాయపరుస్తాయి. కొబ్బరి నీటితో ముఖం శరీర భాగాలు మర్దన చేస్తే పసివాళ్ళ చర్మం మెరుపుతో ఉంటుంది. గోరువెచ్చని నీళ్లే స్నానానికి వాడాలి. స్నానం చేయించే ముందర నీళ్లను చిన్నారుల వీపుపై పోయాలి తర్వాత తలపై పోసి మెత్తని టవల్ పొడిగా తుడవాలి.

Leave a comment