Categories
ఉదయం నుంచి పరుగులే నిమిషం తీరిక లేకుండా పనులు ముగుంచుకుని బాక్స్ లో సర్దుకుని ఆఫీస్ కు పరుగు తీయాలి. మధ్యలో కాస్తయినా మేకప్ వద్దా? అలాగే డల్ గా మొహం పెట్టుకుని పరుగులు తీయాలా? ఇలాంటి టిప్స్ కొన్నుంటే మేకప్ ఈజీనే. లిప్స్టిక్ వేసుకునే ముందర పెదవులపై ముందుగా ఫౌండేషన్ అద్దుకుంటే పెదవుల పై లిప్స్టిక్ రంగు రోజంతా తాజాగా వుంటుంది. వ్యయామం చేసాక మొహం కందిపోయినట్లు వుంటే ఐస్ కోల్డ్ వాటర్ మొహం పైన వుంచుకుంటే ఎరుపు తగ్గుతుంది. బయటకు వెళ్ళే సమయంలో కాస్త బేబీ ఆయిల్ రాస్తే జుట్టు మెరుస్తూ వుంటుంది. ఐలైనర్ ను పది పదిహేను నిముషాలు ఫ్రీజర్ లో ఉంచితే దాన్ని వాడేప్పుడు విరిగిపోకుండా వుంటుంది.