మారుతున్న వాతావరణ పరిస్థితులు పసిబిడ్డ చర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి.పిల్లల మృదువైన చర్మం లో సమతుల్యత లోపించి కాకుండా ఉండేందుకు ఎక్సట్రా మాయిశ్చరైజింగ్ బేబీ ఉత్పత్తులు వాడాలి.చర్మంలో తేమను పరిరక్షించే మూలికలు ఆయిల్స్ తో కూడిన ఉత్పత్తులు వాడాలి .వాతావరణాన్ని బట్టి చిన్నారులకు తలస్నానం చేయించే వేడినీళ్ళ విషయం మారుస్తూ ఉండాలి.ప్రకృతి సహజమైన బాదం, ఆలివ్, అలోవెరా తో చిన్నపిల్లల చర్మాన్ని పరి రక్షిస్తాయి.స్నానం చేయించిన తర్వాతనే చర్మానికి మాయిశ్చరైజర్లు రాయాలి.చలిగాలికి రఫ్ గా అయిపోయిన పాపాయిల బుగ్గలు మోకాళ్ళు ముక్కు మోచేతుల కు బేబీ క్రీమ్స్ వాడాలి. ఆలీవ్ నూనె కూడా బాగా ఉపయోగపడుతుంది.

Leave a comment