ఫంకీ నగలు చాలా మందికి ఇష్టం.కరీదు కాస్త ఎక్కువగానే ఉంటాయి. జాగ్రత్త చేస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఈ నగలు ధరించి తీసేశాక కాస్సేపు వాటిని ఆరనివ్వాలి. గది వాతావరణంలో ఉంచితే సరిపోతుంది. వీటిని అతి వేడిగా ఉన్న చోట అతి చల్లగా ఉన్న చోట వదిలేయవద్దు. మెత్తని వస్త్రంతో దుమ్ము పోయేలాగా తుడిచి ,చెమట తగిలితే ఆరిపోయేదాకా ఉంచాలి. ఒకే చోట బాక్స్ లో పడేస్తే రంగు మెరుపు పోవటమే కాక గీతలు పడతాయి. నగల బాక్స్ లు గాజు ,ప్లాస్టిక్ ,చెక్కవి దొరుకుతాయి. మెత్తని వస్త్రంలో చుట్టి ఈ బాక్స్ ల్లో భద్రపరచాలి. ఈ నగల తడి తగలనివ్వకపోతే ఎక్కువ కాలం మన్నుతాయి. గాఢమైన వాసనలున్న స్ప్రేలు ,సెంట్ లు ఈ నగలపై పడనీయకూడదు.

Leave a comment