ప్రయాణానికి బ్యాగ్ సర్ధుకుంటూ ఉంటే కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. దుస్తుల్ని కుక్కేయటం లేదా చక్కగా మడతలు వేసి పెట్టటం కూడా అసాధ్యమే. అందుకే వీటిలో ప్రత్యేకంగా రోల్ లా చుట్టిపెట్టేందుకు వీలుగా మార్కెట్ లో కవర్లు దొరుకుతున్నాయి.అప్పుడు స్థలం కలిసి వస్తుంది. కాస్త బరువైన వస్తువులు బాగా లోపలి భాగంలో ఉంటే బుజానికి తగిలించుకొన్నప్పుడు వెన్నుని ఆనుకోనే అరలో ఉంచాలి. తేలిక పాటి వస్తువులు దాని చుట్టు అరల్లో ఉంచాలి. అప్పుడే బ్యాగ్ సమతుల్యంగా ఉంటుంది. చిరు తిండ్లు ,ఐడీ కార్డులు బ్యాగ్ పైన పెడితే తీసుకొనేందుకు సౌకర్యంగా ఉంటుంది. మందులు సెల్ ఫోన్ వేర్వేరు కవర్లలో పెట్టి వైర్లు డేటా కేబుల్ వంటివి ఒక రబ్బర్ బ్యాండ్ లో చుట్టేసి పెడితే అస్తమానం వెతికేపని ఉండదు.

Leave a comment