ఆయిల్స్ ,షాంపూలు ,కండిషనర్స్ ఏవి వాడుతున్న ఈ వేసవి ఎండకు జుట్టు పొడిగా ,ఎండినట్లు అయిపోతుంది. ఈ వాతావరణానికి దుమ్ము కూడా తోడవుతుంది. ఖరీదైన ఆయిల్స్ కంటే ఇంట్లో తయారు చేసుకోగలిగే ఈ మిశ్రమం జుట్టును చక్కగా కాపాడుతుంది. కొబ్బరి పాలు, ఆలివ్ ఆయిల్ నిమ్మ రసంతో జుట్టు చక్కగా మెరుపులు మెరుస్తుంది. ఈ మూడు కలిపి ఓ బౌల్ లోకి తీసుకొని, జట్టును చిక్కులు లేకుండా దువ్వుకుని , కుదుళ్ళకు పట్టేలా ఈ మిశ్రమాన్ని పట్టించి ఓ అరగంట అలా వారానికి ఒక సారి చేసినా జుట్టు పాడై పోకుండా మెత్తగా కాంతివంతంగా ఉంటుంది.