తియ్యని మిఠాయిలు తినడం అందరికి ఇష్టమే. కాని ప్రతి నిమిషం పంచదార వాడకం నిలిపివేయమనే సలహాలు వింటాం. కాని తియ్యగా అంటే ఎలా మరి బెల్లంతో చేసిన పదార్ధాలు తినండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పైగా తీపి తినాలనే కోరికను కూడా బెల్లం తగ్గిస్తుంది అంటున్నారు పరిశోధకులు. పాలల్లో కొంచెం బెల్లం కలిపి తాగితే ఎముక పుష్టి పెరుగుతుంది. బెల్లంలో పొటాషియం, ఐరన్, ఫాలెట్ లు పుష్కలంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ది చేయగలదు. రక్తహీనత తగ్గిపోతుంది. ఎర్ర రక్తకణాలు స్థిరంగా ఉంటాయి. ముఖ్యంగా ముఖం పై ముడతలు తొలగించగలుగుతుంది. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆహారంలో కొద్ది మాత్రంగా బెల్లం చేర్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి.

Leave a comment