ఏడాది పోడవునా రోజు ఆహారంలో భాగంగా తీసుకోవలిసిన ప్రయోజనకరమైన గింజలు రజ్మా. ఇవి సమతుల పోషక ఆహరం. ఇందులో తక్షణం శక్తినిచ్చే స్టార్చ్ ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రజ్మాలోని పీచు జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో కోలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఈ గింజలు కొంచెం తిన్నా కుడా కడుపు నిండిన భావన కలుగుతుంది. కెలరీలు తక్కువ ఫెనోలిక్ యాసీడ్ , ఫ్లెవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజల్లో అధికం. ఇవి విడిగా ఉడికించి కూరల్లో కలుపుకోవచ్చు. సూపుల్లోనూ ఈ రజ్మా రుచిగా ఉంటుంది.

Leave a comment