ఒడిస్సా అమ్మాయి శ్రేయో లెంక పాటలకు కవర్ సాంగ్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ఒక పాట పాపాడటమే కాదు, డాన్స్ చేయటం, యోగసాధన ఒడిశా నృత్యం రీతులను ఔపోసన పట్టిన సమర్థురాలు హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకుంది.  పాశ్చాత్య సంగీతాన్ని నేర్చుకుంది. వీటన్నింటిని సమ్మిళితం చేసి ప్రదర్శనలు ఇస్తుంది .శ్రేయో లెంక రూర్కెల కు చెందిన 18 సంవత్సరాల శ్రేయ తల్లిదండ్రులు యోగా శిక్షకులు చిన్నతనం నుంచి యోగా సాధన చేయడం వల్ల శరీరం విల్లులా వంచగలదు శ్రేయో ఇప్పుడీ  శ్రేయో లెంక కొరియాకు చెందిన అమ్మాయి ల బ్యాండ్ బ్లాక్ స్వాన్ లో చేరేందుకు పోటీపడుతోంది వివిధ దేశాలను కు చెందిన నాలుగు వేల మంది ఈ బ్లాక్ స్వాన్ లో చేరేందుకు పోటీ పడుతున్నారు ఇక్కడ శ్రేయ గెలిస్తే కొరియన్ పాప్ బ్రాండ్ లో చేరబోయే తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టిస్తుంది.

Leave a comment