తరచుగా తలనొప్పి బాధిస్తున్నా  వర్కవుట్స్ కు ఇబ్బవండిగా ఉన్నా  ఒక్కసారి శరీరానికి పై భాగం లో వుండే లో దుస్తులపై ఓ కన్నేసి చూడండి. అంటున్నారు లండన్ నిపుణులు. సరిగా ఫిట్ గానీ బ్రా స్ట్రాప్స్ ఇరిటేట్ చేసి ట్రాప్ జయిస్  కండరం పై వత్తిడి తెస్తాయి. ఈ కండరం మెడకు అక్కడ నుంచి భుజాలకు అనుసంధానం అవుతుంది. ఈ కండరం స్ట్రాప్స్ వత్తిడికి బిగుతైపోతూ  మెడలు తలలో టెన్షన్ కు దారి తీస్తుంది. కణతలు వద్ద నొప్పి కళ్ళ  వెనుక లేదా పుర్రె కిందుగా నొప్పి వంటి లక్షణాలుంటాయి. కాబట్టి మహిళల దీర్ఘ కాలిక  నొప్పులతో బాధపడుతుంటే ఈ విషయం పరిగణలోకి తీసుకోమంటున్నారు నిపుణులు. విశాలమైన ప్యాడెడ్ స్ట్రాప్స్ వేసుకుంటే కారణం తెలియని తలనొప్పులు మాయం అవుతాయి. బిగుతైన లో దుస్తులు వేసుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లమే.

Leave a comment