ప్రపంచ వ్యాప్తంగా పండించే ధాన్యాల్లో బార్లీది నాలుగో స్థానం. దంపుడు బియ్యం లాగే పై పొట్టు తీసిన బార్లీ, తెల్లని బియ్యంలా పాలిష్ చేసిన పెరల్ బార్లీ, ఈ రెండింటి మధ్య రకమైన పాట్ బార్లీ, అని మూడు రంగుల్లో లభిస్తాయి. పాట్ బార్లీ వాడకం సూప్ తయ్యారీ లో ఎక్కువ. దంపుడు రకం బార్లీ గంటన్నర ఉడికించాలి. పెరల్ బార్లీ సిం లో గంట ఉడికిస్తే సరిపోతుంది. ఈ ఉడికించిన బార్లీ ఫ్రిజ్ లో పెట్టి అందులో కూర ముక్కలు పండ్ల ముక్కలు సలాడ్ లాగా తినొచ్చు. కిచిడి, పలావ్ చేసుకో వచ్చు. ఇప్పుడు బార్లీ ప్లేక్స్ కుడా వస్తున్నాయి. పండ్లు ఇతర ధాన్యాల కంటే బార్లీ లి పిచు ఎక్కువ. పీచు తో పాటు నియాసిన్ వుండటం వల్ల కోలెస్ట్రోల్ తగ్గుతుంది. గోధుమ గడ్డి లాగా బార్లీ గడ్డి జ్యూస్ తాగుతారు. ఈ లేత గడ్డిలో ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు చాలా ఎక్కువ. ఎదో ఔషదంలాగా జ్వరం వచ్చినప్పుడో, పాదాలకు నీరు చేరినప్పుడో తాగే చల్లని, ఆహారంలో భాగంగా చేసుకుంటే పోషకాలతో పాటు, ఎన్నో అనారోగ్యాలు తగ్గించ వచ్చు.

Leave a comment