అంతర, అంకిత నందీ లు సోషల్ మీడియాలో బాల్కనీ సిస్టర్స్ గా తెలుసు వాళ్లు నందీ సిస్టర్స్ గా ప్రపంచానికి పరిచయం అయ్యారు.ఇద్దరికీ సంగీతం వచ్చు.అంతర హిందుస్థాని మ్యూజిక్ స్కాలర్ అయితే అంకిత సంగీత దర్శకులు చందం రాయ్ చౌదరి దగ్గర మ్యూజిక్ నేర్చుకుంది. ఈ ఇద్దర్నీ ‘ క్లాప్ అండ్ కప్ ‘ సిస్టర్స్ గా కూడా పిలుస్తారు ఎందుకంటే ఒక పాటను వీళ్లు చప్పట్లు, బల్ల పైన దరువు వేస్తూ అద్భుతంగా పాడగలరు ఈ లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా వేదికగా తీసుకుని తమ బాల్కనీ లో గిటార్ వాయిస్తూ పాడటం మొదలు పెట్టారు.ఆధునిక సమ్మేళనం తో వారి కచేరి ఎంతో మందిని ఆకట్టుకుంది.లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

Leave a comment