మధ్యప్రదేశ్ కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల పై అత్యాచారాలు లైంగిక వేధింపులు పెరిగి పోతున్న నేపధ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయానికి ఉపక్రమించింది. 12 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు వున్నా బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు మరణ శిక్ష విధించాలన్న తీర్మానానికి ఆ రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. మహిళల పై సాముహిక అత్యాచారం చేసే నిందితులకు కుడా మరణ శిక్ష విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. . ఇందుకు సంబందించి ఈ శీతాకాల సమావేసాల్లో శాసన సభలో బిల్లు పెడతామని ఆర్ధిక మంత్రి జయంత్ చెప్పారు.

Leave a comment